Saturday, October 17, 2020

Durga Sapta Shati Telugu - దుర్గా సప్త శతి


Durga Saptashati - Full
______________________

______________________
Sonic Octaves Shraddha

దుర్గా సప్త శతి  మార్కండేయ పురాణంలో చెప్ప బడినది

మణిద్వీప వర్ణన-1

‘‘అరుణాంకరుణాతరంగి తాక్షిం, దృతపాశాంకుశ పుష్పబాణచాపాయ్ అణిమాదిభిరావృతాం మయుఖై, రహమిత్యేవ విభావయే భవానియ్’’

జనమేజయా! బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగాన సర్వలోకం ఉందని విన్నావు గదా! అదే మణిద్వీపం. మహాదేవి నివాసం. సర్వలోకాలకన్నా సర్వ విధాలు అధికం కనుక దీన్ని సర్వలోకం అన్నారు. పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్చానుసారం మనస్సులో కల్పించుకుంది. అన్ని లోకాల కన్న ముందు తన నివాసార్ధం నిర్మించుకున్న లోకం ఇది. ఇది కైలాసం, వైకుంఠం, గోలోకం కన్న అత్యధికం. దీని కన్న సుందరమైనది ముళ్లోకాలలోనూ మరెక్కడా లేదు. ఇది ముజ్జగానికి గొడుగు వంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా ఉంటున్నాయి. ఈ మణిద్వీపం చుట్టూ సుధా సమువూదముంది. ఇది బహుయోజన విస్తీర్ణం. అత్యంత గంభీరం. గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు.

రత్నాలు దొరికే ఇసుక తిన్నెలు. శంఖాలకు, మత్య్సజాతులకూ ఇక్కడ లెక్కలేదు. సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలివస్తున్న నీటి తుంపరులతో మణిద్వీపం అంతా ఎప్పుడూ సుఖ శీతలంగా ఉంటుంది. రెపపలాడుత్ను రంగురంగుల జెండాలతో అటూ, ఇటూ ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. రత్న ధ్రువం దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది. ఒక మహావూపాకారం అది. అమోధాతు నిర్మితం. ఇనుముతో, ధాతు శిలలతో దృడంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు సప్తయోజనాలు, నానావిధ శస్త్ర ప్రహరణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షకభటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతుంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తుంటారు.

ఈ ప్రాకారానికి నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాలున్నాయి. నూరుమంది ద్వార పాలకులు ఉన్నారు. ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక గణాలున్నాయి. అందరూ దేవి భక్తులే. దేవి దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతిద్వారం వద్ద కనబడుతుంటాయి. శతాధిక విమానాలు. వాటి ఘంటాఘోషలు అసంఖ్యాక హయహేషలు, ఖూరా ఘాతాలే, దిక్కుల చెవులు చిల్లులు పడతాయి. గణాల కిలకిలారావాలు వేత్రహస్తుల తాడనాలు దేవీ సేవక- దీవ సేవక బృందాలతో కిక్కిరిసి పోయిన ఆ ప్రాంతాల్లో ఎవరిమాట ఎవరికి వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే. నానా ధ్వని సమాకులమే. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళితే అడుగు అడుగున సరస్సులు స్వాదుజల పూర్ణాలు. వివిధ రత్న ద్రుమ వాటికలు, వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షం శతగుణాధికం. దీని మీద గోపురాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అమ్మ జగతుకు మూలం అమ్మను సేవిస్తూ తరించండి.


దుర్గా సప్త శతి

అధ్యాయము 1

అధ్యాయము 2

అధ్యాయము 3

అధ్యాయము 4

అధ్యాయము 5

అధ్యాయము 6

అధ్యాయము 7

అధ్యాయము 8

అధ్యాయము 9

అధ్యాయము 10

అధ్యాయము  11

అధ్యాయము  12

అధ్యాయము 13


Short reading of Durga Sapta shati

Chapter 1 (Madhu kaitabha samhaara) is to be read for 1st day,

Chapter 2, 3 and 4 (Mahishhasura samhaara) to be read on 2nd day,

Chapter 5 and 6 (Dhuumralochana vadha) on the 3rd day,

Chapter 7 (Chanda Munda vadha) on 4th day,

Chapter 8 (Rakta biija samhaara) on 5th day,

Chapter 9 and 10 (Shumbha Nishumbha vadha) on 6th day,

Chapter 11 (Praise of Narayani) on 7th day,

Chapter 12 (Phalastuti) on 8th day,

Chapter 13 (Blessings to Suratha and the Merchant)on 9th day

Chapter 14 (Aparadha Kshamaprarthana) on 10th day

Updated  6 September 2017,   8 October 2016,  6 October 2013


No comments:

Post a Comment