Monday, September 4, 2017

Hindu Dharma - Brahmins - సనాతన (హిందూ ) ధర్మము - బ్రాహ్మణుల పాత్ర



సనాతన (హిందూ ) ధర్మము - బ్రాహ్మణుల పాత్ర

సనాతన ధర్మమును భగంతుడే స్వయముగా స్థాపించాడు అని మనము నమ్ముతాము.  ఆది, అంతము భగవంతుడే. మొదటి జీవిని భగంతుడే పుట్టించాడు. రుద్రుడు ముందు పుట్టినప్పుడు సగం మొగా సగం ఆడగా పుట్టాడని అందుకే అర్ధ నారీశ్వరుడు అని పిలువ బడుతున్నాడని  చెప్పుకుంటాము. ఇలాంటిదే ఇంకొక కద భాగవతములో ఉన్నది.. ఒక మిథునం పుట్టినది. వాళ్ళు దంపతులు అయ్యారు అని.

సృష్టి ప్రారంభములోనే నాలుగు వర్ణములు భగవంతుడు నిర్దేశించాడు. అంటే కొంతమంది కొన్ని పనులలో నిర్దేశించ బడ్డారు.  వాళ్ళ మధ్య భోజన సంబంధములు ఉండకూడదు. వివాహ సంబంధములు ఉండకూడదు అని ఎవరు చెప్పారు. ఎవరో చెప్పారు అనుకోండి ఎవరు విన్నారు?  చాణక్య అర్ధ శాస్త్రములో వర్ణ సంకర వివాహములు చాలా జరిగేవి అని వ్రాసారు. మహా భారతములో కూడా చాలానే జరిగాయి. భీముడు రాక్షస స్త్రీని  వివాహము చేసుకోలేదా.

హిందూ సమాజములో అనేకమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ బ్రాహ్మణులే తీసుకు రాలేదు. సమాజములో మార్పు రావాలి అంటే అనేక మంది ఒప్పుకోవాలి. బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూద్రులు అందరూ శక్తిమంతులే. అందరూ ఒప్పుకుంటేనే వ్యవస్థ నడుస్తుంది.

శూద్రులు విద్యావంతులు కాదు అని చెప్పడం సరి అయినది కాదు. శూద్రులు వేదములను చదువలేదు కానీ, పురాణములను చదవ వచ్ఛు  కదా. ఈ రోజున బ్రాహ్మణులు  ఎన్ని పురాణములను చదివి ఉంటారు. ఆ రోజున పురాణములని చక్కగా చదివిన శూద్రులు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉండే వారో ఒక్క సారి ఊహించండి. శూద్రులకు కూడా సంస్కృతము వచ్ఛేది ఆ రోజులలో.

ఈ రోజున బ్రాహ్మణులు విమర్శకు గురి  అవ్వచ్చు.  పూర్తి సమాజాన్ని విమర్శించకుండా కొంతమందిని విమర్శిండము ఒక పధ్ధతి. కానీ బ్రాహ్మణులు తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే ఈ సమాజానికి లాభము కలిగే మార్పులు కనిపెట్ట గలగాలి.  దానికి ప్రయత్నం చేయాలి.

ఒక బ్లాగులో ఈ  వాక్యాలు వ్రాసి ఉన్నాయి

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది.   (https://ramakasharma.blogspot.in/2017/04/blog-post_44.html )

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. ప్రస్తుత సమాజ స్థితిని అర్ధము చేసుకోవాలి. ఉన్నతికి మార్గము వెతకగలగాలి. ఆ మార్గాన్ని అందరకు నచ్ఛేలా చెప్పగలగాలి. ఫలితాన్ని తీసుకు రాగలగాలి.  ఫలితము వచ్చినప్పుడు గౌరము కొంత పెరుగుతుంది.    

    

No comments:

Post a Comment